9 July, 2026 | 1:00 AM

రాష్ట్రస్థాయి ‘హాకీ’కి పెద్దమందడి విద్యార్థి ఎంపిక

09-07-2026 12:07 AM

పెద్దమందడి జూలై 8: ఈనెల 9, 10, 11 తేదీలలో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు పెద్దమందడిలో పదవ తరగతి పూర్తి చేసిన  పి శివశంకర్ ఎంపికయ్యాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న ఫిజికల్ డైరెక్టర్ మన్యంయాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో చక్కటి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని, మన రాష్ట్రానికి జిల్లాకు మండలానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని AAPC చైర్మన్ మహేశ్వరమ్మ మరియు గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి  ఉపసర్పంచ్ ఉషన్న గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయ బృందం  విద్యార్థిని విద్యార్థులు అభినందిచారు