02-07-2025 04:14:24 PM
చండూరు,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Rajagopal Reddy) అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న భవనాన్ని కూల్చివేయడంపై చౌరస్తాలో నిరసన తెలియజేస్తూ, రోడ్డు విస్తరణ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాజీ ఎంపీపీ తోకల వెంకన్న కు చెందిన భవనాన్ని కూల్చివేయడం ముమ్మాటికి రాజకీయ కక్ష అని ఆయన అన్నారు.
ప్రభుత్వ అధికారులు స్వతంత్రంగా కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సహకారంతో 50 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వారు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై 18 నెలలు కావస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి ఒక్క రూపాయి తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశావని ఆయన ఎద్దేవా చేశారు.
రోడ్డు వెడల్పు పనులకు డీపీఆర్ లేకుండా ఒక దగ్గర 95 ఫీట్లు అని, మరొక దగ్గర 90 ఫీట్లు అని వారి అనుచర గణానికి, ముడుపులు ముట్టినచోట 85 ఫీట్లు అని ఇష్టానుసారంగా వ్వ హవరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. కెసీఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేశామని, త్యాగాలు చేశామని ఇలాంటి దగాకోరుకు భయపడేది లేదని ఆయన అన్నారు.