26-08-2025 06:30:02 PM
బోథ్,(విజయక్రాంతి): దివ్యాంగులకు నెలకు రూ. 6 వేలు పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జక్కుల నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు దివ్యాంగులతో కలిసి బోథ్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని ఆ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన రూ. 4 వేల పింఛన్ ను రూ 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల నిరాహార దీక్షలు చేస్థామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, శంకర్, రవి పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు