26-08-2025 07:34:01 PM
వనపర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కొత్తకోట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల 3 కేసులు నమోదైన నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లో యాంటీ లార్వా, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రాట్ పరీక్షలను నిర్వహించి రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. డెంగ్యూ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, ఇతర వైద్యాధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.