calender_icon.png 26 August, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన రేషన్ డీలర్లు

26-08-2025 07:15:24 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినా తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జిల్లాలోని రేషన్ డీలర్లు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ మాట్లాడుతూ...  జిల్లాలో 577 మంది రేషన్  డీలర్లు ఉన్నారని తెలిపారు. గత 5 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. బియ్యం పంపిణీ అయిపోగానే కమీషన్ వెయ్యాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ఒకే దఫాలో ఇవ్వాలన్నారు.