calender_icon.png 26 August, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ నార్త్ పాఠశాలలో మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థినిలు

26-08-2025 07:32:28 PM

నిజామాబాద్ పట్టణంలో గల కేజీబీవీ నార్త్ పాఠశాలలో విద్యార్థినిలు(KGBV North School students) మట్టి గణపతుల చక్కగా తయారు చేసినట్లు పాఠశాల ప్రత్యేక అధికారి అశ్వినీ తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి(Ganesh Chaturthi-2025) సందడి మొదలైంది. భక్తులు లంబోదరుడికి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు చేయనున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మట్టి విగ్రహాల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్లాస్టిక్ , పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాల వాడకంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.