calender_icon.png 18 July, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

120 టన్నుల ఇసుక డంప్ సీజ్

17-07-2025 01:07:52 AM

హుస్నాబాద్, జూలై 16 :  ఇసుక అక్రమ రవాణాపై సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్కన్నపేట మండల కేంద్రంలో డంప్ చేసిన 120 టన్నుల ఇసుకను సిద్దిపేట టాస్క్ఫోర్స్, అక్కన్నపేట పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

అక్కన్నపేటకు చెందిన మిడిమాలపు సాంబరాజు ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆకస్మిక దాడి చేసి ఇసుక  డంపు తో పాటు ఒక ట్రాక్టర్ను కూడా సీజ్ చేశారు.