calender_icon.png 28 October, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల బెనిఫిట్స్ చెల్లించాలి

26-10-2025 12:37:12 AM

ముఖ్యమంత్రికి రాంచందర్ రావు లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల (పెన్షనర్స్) బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన శనివారం రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు.

పెన్షనర్లకు సకాలంలో బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  తెలిపారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన  ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే అందజేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.