26-10-2025 12:38:14 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 మంది కొత్త సూపర్‌వైజర్లను ప్రభుత్వం నియమించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె అన్నారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎ స్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వుజర్లకు మంత్రి సీతక్క నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి నూతన సూపర్వుజర్లను అభి నందించారు.అనంతరం మంత్రి సీతక్క మా ట్లాడుతూ. ‘మీ ఉద్యోగ కలలను రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది’ అని పేర్కొన్నారు. ‘ఐసీడీఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రాణం పోశారు. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలకు తెలంగాణ నేల నుంచే బీజం పడ్డా యి.
1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయి’ అని అన్నారు. ఒక్కో సూపర్వుజర్ కింద 25 అంగన్వాడీ కేం ద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందన్నారు. ‘అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయి. చిన్నారుల కోసం 57 రకాల ఆటవస్తువులు, యూనిఫాం లు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ర్టం తెలంగాణ.
కాబట్టి ప్రతి సూపర్‌వైజర్ తన వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో పాటించాలి’ అని ఆమె సూచించారు. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని తెలిపారు. నియామక పత్రాలు అందు కునే సమయంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమం లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.