17-12-2025 06:24:12 PM
50 ఏళ్ల కుటుంబ పాలనకు తెరదించిన నిర్మల బాలస్వామి..
524 ఓట్ల మెజార్టీతో ఘన విజయం చేకూర్చిన గ్రామస్తులు..
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
జడ్చర్ల: మూడవ విడతలో జరిగిన పంచాయితీ ఎన్నికలలో జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసిన నిర్మల బాలస్వామి ఆ గ్రామంలో గత నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఒకే కుటుంబ పాలనను అంతం చేసి ఒక కొత్త చరిత్రను సృష్టించారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ గ్రామం జడ్చర్ల పట్టణానికి చేరువలోనే ఉంటుందని, సుమారు రెండున్నర వేలు జనాభా కలిగిన ఈ గ్రామంలో దాదాపు 50 ఏళ్ల కాలంగా ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచులుగా కొనసాగుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రామంలో ఇదే సంప్రదాయం కొనసాగిందన్నారు. తన విజయానికి వెన్నంటి నిలిచిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సర్పంచ్ నిర్మల, బాలస్వామి కృతజతలు తెలిపారు.