17-12-2025 07:23:55 PM
మోతే (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పల్లెల నవీన్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని బుధవారం మానవత హృదయం కలిగిన మోతె గ్రామ నివాసి అయిన ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పగడాల గిరిధర్ రెడ్డి సుమారు 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. అనంతరం నూతనంగా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన దోసపాటి అనురాధ చేతుల మీదగా మృతుని భార్య పల్లెల నందినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నికైన బొక్క ఉపేందర్ రెడ్డి, గడ్డం రామ్ రెడ్డి, రంగయ్య, యల్లయ్య, రాము, నరేష్, నారాయణ, ఉపేందర్, నవీన్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.