02-08-2025 12:47:27 AM
తెలంగాణలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడం వల్ల లబ్ధిదారులకు సకాలంలో పింఛను అందడం లేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళా పింఛన్లు వంటి అనేక పథకాల కింద వేలాది పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశంపై అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
వివిధ పథకాల కింద రాష్ట్రప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేయాల్సిన డబ్బుల వివరాలు ఇప్పటికే యంత్రాంగం వద్ద ఉన్నప్పటికీ, నిధులు విడుదల కాకపోవడంతో పింఛన్లు నిలిచిపోయాయి. ఈ జాప్యానికి సాంకేతిక సమస్యలు కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, పింఛన్లు రావడం లేదని లబ్ధిదారులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేవని, ఈమధ్య కాలంలో జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వెంటనే పెండింగ్‌లో ఉన్న పింఛన్ల సొమ్మును విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా తెలియడం లేదు. దీంతో పింఛన్లపై ఆధారపడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
రాజేశ్, నిజామాబాద్