calender_icon.png 4 August, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోవాలాలను ఆదుకోవాలి..

02-08-2025 12:45:25 AM

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత తమకు సరైన మాలాంటి ఆటోవాలాలకు సరైన ఆదాయం రావడం లేదు. సర్కార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయింది. గతంలో ఆటో ప్రయాణం చేసే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఆటోవాలాల ఆదాయం బాగా పడిపోయింది. గతంలో రోజుకు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.600 వరకు సంపాదించే ఆటోవాలాలు, ఇప్పుడు రూ.300 కూడా సంపాదించలేకపోతున్నారు.

ఇది వారి జీవనానికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. కుటుంబ పోషణ భారంగా మారడంతో చాలామంది ఆటోవాలాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్లు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

ఆటోవాలాల కోసం ఏదైనా ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని, లేదంటే వారికి ఏదైనా ఉపాధి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు మేలు చేస్తున్నప్పటికీ, ఆటో డ్రైవర్ల జీవనోపాధిని మాత్రం దెబ్బతీస్తోందని ఆటోవాలాలు చెప్తున్నారు.

 చెన్నయ్య, రామగుండం