13-07-2025 12:51:40 AM
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. ఇక దొంగలెవరో? హీరో లెవరో? అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలుకు తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో ప్రతి ఒక్కరికీ తెలుసున్నారు.
శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో మాట్లాడుతూ.. ‘ఇది సామాజిక న్యాయానికి నాంది పలికే చారి త్రాత్మక ఆర్డినెన్స్. ఈ మైలురాయి నిర్ణయాన్ని ఆవిష్కరించిన సమయం లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం నా జీవితంలో అదృష్టంగా భావిస్తు న్నా’ అని అన్నారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తారు.
‘బీఆర్‌ఎస్‌లో దెయ్యాల పీడ ఉందా? లేక దెయ్యా లే పనిచేస్తున్నాయా? కవిత సూటిగా చెప్పాలి. ఆమె ఏ పార్టీకి చెందినవా రో ప్రజలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రకటించిన రిజర్వేషన్లపై కవిత సంబురాలు చేసుకోవడం హా స్యాస్పదం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో ఆమె లిక్కర్ స్కామ్ ఊచలు లెక్కపెడుతున్నారని ఎద్దేవా చేశారు.