13-07-2025 12:39:34 AM
రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్
లక్సెట్టిపేట, జూలై 12: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి లక్సెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యమందించేం దుకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కృషి చేస్తున్నారని కొనియాడారు. లక్సెట్టిపేటలో ఆసుప త్రి, పాఠశాల, కళాశాలలను నిర్మించిన ఘనత ప్రేమ్‌సాగర్‌రావుకే దక్కిందన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ లక్సెట్టిపేటతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.