13-07-2025 12:54:01 AM
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాంగ్రెస్‌నేత కేశవరావు మాట్లాడింది తమకు అస్సలు అర్థం కావడం లేదని, బీఆర్‌ఎస్‌లో ఉన్నపుడు ఆయన బాగానే ఉన్నారని, కాంగ్రెస్‌లోకి మళ్లీ వెళ్లాక ఏం జరిగిందో తెలియడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ మొదట్నుంచి స్థానిక సంస్థల్లో బీసీలకు రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతోందని తెలిపారు.
ఢిల్లీకి అఖిల పక్ష నాయకులను తీసుకెళ్లి బిల్లుకు రాష్ర్టపతి ఆమోదముద్ర తెస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పి మాట తప్పారని విమర్శించారు. ప్రభు త్వానికి అసెంబ్లీలో సహకరించామని, ఇంకా ఎలా సహకరించాలని ప్రశ్నించారు. తొమ్మి దో షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లు చేర్చాల్సిన అవసరం లేద ని కేశవరావు ఎలా అంటా రని మండిప డ్డారు. అనేక రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును సుప్రీం కోర్టు కొట్టి వేసిందని కేశవరావుకు తెలియదా అని ప్ర శ్నించారు.
ఎన్నికలు ఉన్నాయని ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అం టున్నారని, మరి విద్య, ఉద్యోగాల్లో 42 శా తం రిజర్వేషన్లకు ఎందుకు ఆర్డినెన్స్ ఇవ్వడం లేదని అడిగారు. ఆర్డినెన్స్ ద్వారానే రిజర్వే షన్లు పెంచే అవకాశం ఉంటే మిగతా రాష్ట్రా లు కూడా ఇదే పద్దతిని పాటించేవని తెలి పారు. మహారాష్ర్ట, బీహార్‌లో తప్పుడు విధా నాలతో రిజర్వేషన్లు ఇస్తే కోర్టు కొట్టేసిందని, ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చు కోకుండా ఆర్డినెన్స్‌తో ఎలా ఇస్తారని ప్రశ్నిం చారు.
ఈ వ్యవ హారంలో బీజేపీ నేతలు మౌనంగా ఉంటు న్నారని, బీసీ బిల్లు ఆమోదానికి బీజే పీ నేత లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము పార్టీలో అన్నీ చర్చించాకే బీసీ రిజ ర్వేషన్లపై వైఖరి చెబుతున్నామని, పార్టీలో ఎ వరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే దాంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.