calender_icon.png 14 November, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు సౌండ్ సిస్టం వితరణ

14-11-2025 09:49:10 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని  పురస్కరించుకొని  గుండాల గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత,   ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు  మానాల వెంకటేశ్వర్లు  ఆధ్వర్యంలో రూ 25 వేల విలువగల  సౌండ్ సిస్టంను  పాఠశాలకు వితరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దని ఉన్నత లక్ష్యం ఎంచుకొని ముందుకు సాగాలన్నారు.

మత్తు పానీయాలకు  దూరంగా ఉండాలని, సెల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని, చదువు పైనే దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మానాల శ్రవణ్,మానాల ప్రభాకర్,మానాల ఉపేందర్, తవిడిశెట్టి నాగరాజు,తవిడిశెట్టి రాంబాబు,శ్రీరంగం శ్రీనివాసు ,తాటికొండ వీరన్న  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కే.పార్వతమ్మ  ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు. తమ పాఠశాలకు సౌండ్ సిస్టం   అందించడంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పాఠశాల ఉపాధ్యాయ బృందం మానాల వెంకటేశ్వర్లు గారిని  ఘనంగా సన్మానించారు.