గుంతలమయమైన రోడ్డు.. అవస్థల్లో ప్రజలు..
పట్టించుకోని అధికారులు
తాడ్వాయి, ఆగష్టు, 6 (విజయక్రాంతి): మెరుగైన రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం.. రోడ్ల విషయాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి వెళ్లే రోడ్డు అద్వానంగా మారింది.
ఎర్ర పహాడ్ గ్రామం నుంచి నందివాడ వరకు ఉన్న రోడ్డు గుంతల మయం కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ప్రయాణికులు మరీ ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అద్వానంగా మారడంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎర్రపహాడు నుంచి నందివాడ గ్రామం వరకు ఆటోలో ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.రోడ్డు అద్వానంగా ఉండడంతో ఆటో నిర్వాహకులు సైతం గ్రామానికి రావాలంటేనే భయతున్నారు.దీంతో ప్రయానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వెంటనే రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలి...
రోడ్డు చాలాచోట్ల గుంతల మయం కావడంతో రోడ్డుకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డుపై అడుగడుగున గుంతలు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల రోడ్డు అద్వానంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఈ రోడ్డుపై నందివాడ, పల్లె గడ్డ తండా, పిర్మయకుంట తండా, సామదిబ్బ తండా ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారు.
అధ్వానంగా రోడ్డు..
రోడ్డుపై చాలా గుంతలు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో రోడ్డు పై ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలి. గతంలో చాలాసార్లు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులు కోరాం. కానీ ఇప్పటికీ ఎవరు స్పందించడం లేదు.
కుమ్మరి రాములు, నందివాడ






