ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి
07-08-2026 01:46 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు చేసి నష్టపోకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. వేరుశెనగ, ఆయిల్పామ్, ఉల్లి, కూరగాయలు, కంది, మినుములు వంటి పంటలను ప్రోత్సహించాలని, మండల వ్యవసాయ అధికారులు లక్ష్యాల మేరకు పని చేసి ప్రతిరోజూ పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.






