7 August, 2026 | 2:26 AM

ఏసీబీ వలలో ఆత్మకూరు జీపీవో

07-08-2026 01:46 AM
  1. పేరు మార్పిడి కోసం రూ.5వేలు డిమాండ్ చేసిన ఉద్యోగి
  2. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ఘటన

మెట్‌పల్లి, ఆగస్ట్ 6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరుకి చెందిన గ్రామ పాలనాధికారి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాపాసు పుస్తకంలో పేరు మార్పు గురించి ఆత్మకూర్ గ్రామానికి చెందిన మల్లేష్ జీపీవో రాజేష్‌ను సంప్రదించాడు. దీంతో గ్రామ పరిపాలనాధికారి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దీంతో గురువారం కరీంనగర్ ఏసీబీ అధికారుల వ్యూహం ప్రకారం గ్రామ పాలనాధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కరీంనగర్ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ డీఎస్పీ మహేంద ర్ రెడ్డి తెలిపారు. అధికారులు లంచం అడిగితే టోల్‌ఫ్రీనం- 1064కు, 9440446106కు ఫిర్యాదు చేయాలని సూచించారు.