2 July, 2026 | 4:52 AM

నదీగర్భ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

30-05-2025 12:20 AM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ 

గద్వాల, మే 29 ( విజయక్రాంతి ) : పి జె పి కెనాల్ ఇన్ఫ్లో పెరిగినందున లోతట్టు ప్రాంతాలు మరియు నదీగర్భ ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతో ష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎగువ ప్రాంతాలలో అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా ధరూర్ మండలంలోని  పరీవాహక ప్రాంతాలలో ఎగువ ఆనకట్టల నుండి నేటి విడుదల పెరిగినందున, పీజేపీ ఆనకట్టలోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని, ఈ సాయంత్రం నాటికి స్పిల్వే గేట్లు తెరవబడతాయని, ప్రస్తుతం ఉన్న 40,000 క్యూసెక్కుల నుండి రేపటి వరకు దాదాపు 1,00,000 క్యూసెక్కుల నేటి ప్రవాహం పెరగవచ్చుని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భద్రత కోసం తగినా జాగ్రత్త చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు.

నదిలో నీటి మట్టాలు పెరిగే అవకాశం గురించి నివాసితులను, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మరియు నదీగర్భ ప్రాంతాలలోని వారిని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. తదుపరి నోటీసు వచ్చే వరకు నదీగర్భంలోకి లేదా ఆనకట్ట దిగువన ఉన్న ఏవైనా వరదలకు గురయ్యే మండలాల్లోకి ప్రవేశించవద్దని లేదా వాటిలోకి వెళ్లవద్దని ప్రజలకు తెలుపారు.