calender_icon.png 30 October, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

29-10-2025 07:10:22 PM

నేలకొరిగిన పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు..

గరిడేపల్లి (విజయక్రాంతి): మొంథా తుఫాన్ తాకిడికి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని అబ్బి రెడ్డిగూడెం గ్రామంలో వర్షాలకు నేలవాలిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయానికి మొంథా తుఫాన్ రావడంతో పండిన వరి పంట పూర్తిగా నేల పాలైందన్నారు.

వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ 50.000 నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. వరి పంటకు పెట్టుబడి మొత్తం పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ వల్ల రైతులు తీవ్రగా నష్టపోయారని వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వీరస్వామి,వెంకట్ రెడ్డి, వెంకన్న,సోమయ్య,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.