20-08-2025 12:52:17 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి)ః ఐసీఎమ్మార్ నివేదిక ప్రకారం రాష్ర్టంలో ఈ ఏడా ది కొత్తగా 55 వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారు డా.నోరి దత్తాత్రే యుడు పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత తెలంగాణ ను తీర్చిదిద్దటానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన ప లు అంశాలను మంగళవారం సచివాలయంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సిం హతో చర్చించారు.
రాష్ర్టంలో క్యాన్సర్ నిర్మూలన పై రూపొందించిన పలు అంశాలను పవర్ పా యింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. క్యాన్స ర్ చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, బా ధితుల కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో డే కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని డా.నోరి సూ చించారు. అలాగే రాష్ర్టంలో ఏఏ ప్రాంతాల్లో క్యా న్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయో వైద్య శాఖ అధికారులు నోటిఫై చేసి, వ్యాధి నివా రణపై పరిశోధనలు నిర్వహించాలన్నారు.
రాష్ర్టం లో క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సాయా న్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా సేవలను అం దించడాన్ని స్వాగతించారు. నిమ్స్, ఎంఎన్ జే క్యా న్సర్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు న్నాయన్నారు. తొలి దశలో క్యాన్సర్ లక్షణాలు బయటపడిన వారికి జిల్లా ప్రభుత్వ అస్పత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.
నిమ్స్, ఎంఎన్‌జేలో క్యాన్సర్ చికిత్సలను అం దిస్తు న్న సమాచారం ప్రజలకు తెలిసేలా అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. క్యాన్సర్‌పై ప్ర తి ఓక్కరికీ అవగాహన ఉండేలా ప్రమోషన్ కార్య్ర కమాలు నిర్వహించాలన్నారు. క్యాన్సర్‌పై అవగా హన వర్క్‌షాపులను ప్రతి మెడికల్ కాలేజీలో ని ర్వహించాలని అధికారులను మంత్రిఆదేశించారు.