calender_icon.png 20 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంచి కొట్టిన వాన.. తెగిన చెక్ డ్యాం

20-08-2025 12:52:25 AM

  1. ఉదృతంగా ప్రవహిస్తున్న ఊగ చెట్టు వాగు 

అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే 

అడ్డాకుల ఆగస్టు 19 :  మండల కేంద్రం లో  సోమవారం తెల్లవారు జాము వరకు వర్షం  దంచి కొట్టింది. గత వారం రోజుల నుంచి గంటల తరబడి క వాన పడడంతో మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో జలమ యం అయ్యాయి. భారీ వర్షానికి అడ్డాకుల మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఊక చెట్టు వాగుపై  ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చెక్ డ్యాం తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి..

రైతుగొల్ల మోహన్ చెక్ డ్యాం దగ్గర  రెండు ఎకరాల వరి పంట వాగులో కొట్టుకపోయిందని ఆవే దం వ్యక్తం చేశారు. దాదాపు పదిమంది  రై తులు పొలాల్లోకి నీరు వచ్చి పంట నష్టపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు.ఈ విష యం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మ ధుసూదన్ రెడ్డి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అడ్డాకుల తాసిల్దార్ శేఖర్, ఎంపీడీవో సద్గుణ, వ్యవసాయ అధికారులు పరి శీలించారు. గ్రామస్తుల సంఘటన స్థలం ద గ్గరికి చేరుకొని గొల్ల మోహన్, రైతులు ప్ర భుత్వం తరఫున సహాయం చేయాలని గ్రా మస్తులు కోరారు. నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.