calender_icon.png 20 August, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపల్లి దేవాలయాల, ప్రభుత్వ శిఖం భూములపై ఫిర్యాదు

20-08-2025 12:51:26 AM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణంలోని దేవాలయ, ప్రభుత్వ శిఖం భూములపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ కరీంనగర్ రెవిన్యూ డివిజన్ అధికారి, కొత్తపల్లి తహసీల్దర్ గారికి పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం బండారి శేఖర్ మాట్లాడుతూ  కరీంనగర్ జిల్లా కొత్తపల్లి (హవేలి) పట్టణ కేంద్రంలోని శ్రీ సచ్చిదానంద స్వామి (రామాలయం) ట్రస్టు భూములు, వీరబ్రమ్మేంద్రస్వామి భూములు, ప్రభుత్వ శిఖం భూముల నుండి రహదారి కోసం ఒక స్కూల్ కు, కొంతమందికి రియల్ స్టేట్ వ్యాపారానికి అనువుగా ఉండేందుకు 33 ఫీట్ల రహదారిని 99 సంవత్సరాలకు 98 లక్షలకు అక్రమంగా లీజకు ఇవ్వడం ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ లోజును రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. లీజు అగ్రిమెంట్ కాపీలో సర్వే నెం. 278/5, 276, 277లో  ఈ సర్వే నెంబర్ లు వేశారు వీటిపై   సమగ్ర విచారణ చేయాలి డిమాండ్ చేశారు.