calender_icon.png 23 October, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

23-10-2025 02:34:14 PM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

కల్వకుర్తి: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని(Kalwakurthy Government Hospital) తనిఖీ చేసి మాట్లాడారు. ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల‌ని, ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు.

సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. అంతకుముందు ఆసుపత్రిలోని పరిసరాలు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లు, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించి రోగుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ఇబ్రహీం, వైద్యులు పాల్గొన్నారు.