19-05-2025 12:00:00 AM
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మోతే, మే 18:- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని గోపతండ ఆవాస గ్రామమైన గొల్లగూడెంలో జరుగు కార్యక్రమా నికి విచ్చేసి ఆయన మాట్లాడారు రాష్ట్రంలో భూసమస్యల పరిష్కరించాలనే లక్ష్యంతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వాటి ఉపయోగాలను కార్యకర్తలు నాయకులు ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని భూ సమస్యల పరిష్కారంలో గ్రామస్థాయిలో పనిచేసే అధికారులను త్వరలో నియామకం చేపడతామన్నారు.
భూభారతి చట్టం రాష్ట్రంలో పూర్తిస్థాయి లో అమలు చేసేందుకు కొన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే అమలు జరుగుతుంద న్నారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాజీ ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి బానోత్ మాతృనాయక్ మండల సీనియర్ నాయకుడు సామ వెంకటరెడ్డి పూలబొకేతో స్వాగతం పలికారు. మాజీ సర్పంచ్ లు కొర్ర తిరుపతి నాయక్, పెరుగు ఉపేందర్,వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.