calender_icon.png 13 August, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

11-08-2025 01:18:52 AM

అలంపూర్, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాల పేరిట సబ్సిడీ లోన్లు ఇప్పిస్తామని కొందరు సైబర్ మోసగాళ్లు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్త్స్ర చంద్రకాంత్ అన్నారు.

ఈ మేరకు ఆ దివారం ఎస్త్స్ర మాట్లాడుతూ..ఏదో ఒక బ్యాంకు పేరు మీద ఫేక్ ఐడి కార్డు సృష్టించుకుని లోగో పట్టుకుని గ్రామాల్లో కొందరు మోసగాళ్లు సంచరిస్తున్నారని ఎస్బిఐ బ్యాంకులో రూ. 10 లక్షల రూపాయల లోన్ మంజూరు చేపిస్తామని అందులో 30% సబ్సిడీ వస్తుందని ప్రజలను మభ్యపెడుతున్నట్లు తెలిపారు.ముందుగా పదివేలు కట్టితే 20 రోజుల్లో మీ అకౌంట్లో 10 లక్షలు పడ తాయి అంటూ ప్రజల నుంచి ఆధార్ ,పాన్ కార్డులు తీసుకుని సెల్ ఫోన్ కి ఓటిపి వస్తుంది చె ప్పాలంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారన్నారు.

అలాంటివి వారికి సమాచారం ఇవ్వొద్దన్నారు. సైబర్ మోసగాళ్లు మీ గ్రామాల్లో కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు లోన్లకు సంబంధించి తదితర వివరాలను సమీపంలోని బ్యాంక్ అధికారులను సంప్రదించి అడిగి తెలుసుకోవాలన్నారు.