04-10-2025 09:20:02 AM
నాలుగు వెల్డింగ్ దుకాణాలు పాక్షికంగా దగ్ధం.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్(Tandoor) పట్టణం లో నేడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే బ్రిడ్జి సమీపంలోని రెడ్డి చికెన్ సెంటర్ వద్ద ఉన్న నాలుగు వెల్డింగ్ దుకాణాలకు (డబ్బాలు) నిప్పు అంటుకొని అగ్ని కీలలు ఎగసాయి. మంటలను చూసిన అక్కడ ఉన్నవారు వెంటనే అగ్నిమాపక(Fire Accident) శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ వారు మంటలను ఆర్పి వేశారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వెల్డింగ్ దుకాణ (డబ్బాల) యజమానులు కోరుతున్నారు.