6 April, 2026 | 8:15 AM

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

07-05-2024 12:36 AM

కమిషనర్ శరత్‌చంద్ర 

రాజేంద్రనగర్, మే 6 : ప్రజలు సామాజిక బాధ్యతతో ఓటు హక్కును వినియో గించుకోవాలని సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యూకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టీసిపేషన్ కార్య క్రమం నోడల్ ఆఫీసర్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చం ద్ర అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో స్వీప్ కార్యక్రమాన్ని బీజేఎంసీ పిబెల్ సిటీలోని సీనియర్ సిటిజన్స్‌కు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేశ్, అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.