6 July, 2026 | 9:41 PM

Breaking News

చంద్రపురి డివిజన్‌లో సర్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం   •   గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •  

ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

13-06-2025 02:21 AM

గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌లో ఏసీపీ రమేష్

గోదావరిఖని, జూన్ 12(విజయ క్రాంతి) ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని గోదావరిఖని లో పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో ఏసీపీ రమేష్ అన్నారు.గోదావరిఖనిలోని 13వ డివిజన్ విటల్ నగర్ లో రోహిణి ఫౌండేషన్ వారి సహకారంతో పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను గురువారం ఏర్పాటు చేయగా క్యాంపుకు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, గోదావరిఖని 1-టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి లు మెడికల్ క్యాంపు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ప్రజలు మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్యాంప్ లో బిపి, షుగర్, హెచ్ బి, ఓరల్ క్యాన్సర్, డెంటల్ సంబంధిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. పరీక్షలు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయాలని,  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

రోహిణి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఇట్టి ఉచిత మెడికల్ క్యాంపును అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1-టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రమేష్, డాక్టర్లు నిదిన్, అఖిల, ధనుంజయ్, అరుణ్, అఖిల, అసిస్టెంట్ శివ, విఠల్ నగర్ ప్రాంత ప్రజాప్రతినిధులు చుక్కల శ్రీనివాస్, కుకట్ల ఓదెలు, మల్లయ్య, రవి, రామ్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.