calender_icon.png 26 July, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం

26-07-2025 01:12:28 AM

డిప్యూటీ మేయర్  మోతే శ్రీలతశోభన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ డిప్యూటీ మేయ ర్  మోతే శ్రీలతశోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ర్ట అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి తో కలిసి శుక్రవారం లాలాపేట్‌లోని ప్రభుత్వ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను, హాస్పిటల్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. వైరల్ వ్యాధులు, డెంగ్యూ, టైఫాయి డ్ జ్వరాల నియంత్రణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోతే శ్రీలతశోభన్‌రెడ్డి మాట్లాడుతూ..

ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్య లు తీసుకుంటోందని, గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తోందని పేర్కొన్నారు. లాలాపేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా తార్నాక, లాలాగూడ, లాలాపేట్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.