26-07-2025 01:13:48 AM
స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్న విద్యార్థులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపి యాడ్ 2025లో నారాయణ కాలేజీ విద్యార్థులు స్నేహిల్ ఝా, ఆగం షా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థులు భారత్ తరఫున పాల్గొన్ని విజయకే తనం ఎగురవేశారు.
అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ అనేది జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగే అత్యంత ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష. 87 దేశాల నుంచి పాల్గొ న్న వందలాది విద్యార్థుల మధ్య పోటీ ని తట్టుకుని వివిధ దశలను దాటుకుంటూ చివరిదైన 5 దశను విజయవంతంగా దాటి విజేతలుగా నిలిచారు. అంతర్జాతీయ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్, అంతర్జాతీయ బయాలజీ ఒలింపి యాడ్, అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్, అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర, ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ వం టి వేదికలపై స్నేహిల్ ఝా, ఆగం షా చూపిన అసా ధారణ ప్రతిభాపాఠవాలు, అత్యుత్తమ ప్రదర్శన వారి మేధస్సుకు, నిరంతర కృషికి నిదర్శ నంగా నిలుస్తోంది.
నారాయణ విద్యాసంస్థల్లో అందించే అత్యుత్తమ శిక్షణ ఫిజిక్స్ ఒలింపియాడ్ మరోసారి తార్కాణంగా నిలుస్తోం ది. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ విద్యార్థులను అభినందించారు. నారాయణ విద్యార్థులు అంతర్జా తీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2025లో సాధించిన విజయం పట్ల ఎంతో గర్విస్తున్నామన్నారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి శరణి నారాయణ మాట్లాడు తూ.. ఒలింపియాడ్ శిక్షణ విధానానికి వచ్చే సరికి స్పష్టమైన కాన్సె ప్టు, లక్ష్యబద్ధమైన శిక్షణ మరియు వ్యక్తిగత మార్గదర్శకతను కలిపి రూపొందించబడిందన్నారు.