calender_icon.png 26 July, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

26-07-2025 01:11:01 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 25 (విజయక్రాంతి):  గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం  డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలలో జిహెచ్‌ఎంసి,  జలమండలి అధికారుల తో కలిసి గాంధీనగర్ డివిజన్ లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని కార్పొరేటర్ కోరారు. వర్షాల వల్ల వరద నీరు నిలవకుండా చేపట్టిన పనులను అధికారులు, హైడ్రా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రా బాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, వాటర్ వరక్స్ డి జి ఎం కార్తీక్ రెడ్డి, జిహెచ్‌ఎంసి డిప్యూటీ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్ సిబ్బంది, బీజేపీ డివిజన్ అద్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.