09-08-2025 12:20:38 AM
ఆలేరు, ఆగస్టు 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు పెంపు దల, ఎస్సీ కులాల వర్గీకరణకు శాసనసభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది, రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా చట్టబద్ధతను కోరిందని, రాజ్యాంగ సవరణ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణ శాసన సభ ఆమోదాన్ని బేషరతుగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని, 9 షెడ్యూల్ లో చేర్చ డానికి రాజ్యాంగ సవరణ చేయాలని సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ లు కేంద్ర బీజేపీ మోడీ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు ఆలేరు లో పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ, బీ జే పీ,బీసీ పరిధిలో ఉన్న ముస్లిం రిజర్వేషన్ లను వారికి గల చట్ట బద్ధతను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్సు పై సంతకం చేయలేదని, గవర్నర్ స్పందన సహేతుకంగా లేదని అన్నారు. బీ సీ సంఘాలుగా, వ్యక్తులుగా ఉన్న ప్రముఖులు అవకాశవాదం తో భిన్నమైన వాదనలు చేస్తున్నారని అన్నారు.
న్యాయపరమైన చిక్కుగా రిజర్వేషన్ లు 50 శాతం మించకూ డదనే విషయాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డి మాండ్ చేశారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 వ షెడ్యూల్ ని బీ సీ రిజర్వేషన్ లకు వర్తిం పచేయాలని డిమాండ్ చేశారు. తమిళ నాడులో తొమ్మిదో షెడ్యూలు అమలులో ఉందని ఇబీసీలకు 10% రిజర్వేషన్ అమ లులో కేంద్ర ప్రభుత్వం పార్ల మెంటు ద్వారా 9వ షెడ్యూల్ను వర్తింపజే సిందని అన్నారు.
రాజ్యాంగ హక్కుగా వెనుకబడిన కులాలు, ముస్లింలు రిజర్వేషన్లను సుదీర్ఘకాలంగా అనుభవిస్తున్నారని, సచార్ కమిటీ నివేదిక తదనంతరం బిజెపి ప్రభు త్వం ముస్లింల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా విద్వేషాన్ని రెచ్చగొడు తున్నదని ఆరోపించారు. బీసీ సంఘాలు, వ్యక్తులు సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఈ ఐక్య ఆందోళనకు సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. కులగణన, జన గణనలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని సామాజికంగా అణిచి వేయబడిన వారం దరూ పురోగమిం చేట ట్టుగా చర్యలు చేప ట్టాలని, జనా భాను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లలో తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.