09-08-2025 12:19:11 AM
మర్చిపోయిన వస్తువులను వెళ్లిన తిరిగి తెచ్చిస్తున్న ఆర్టీసీ సిబ్బంది
జడ్చర్ల ఆగస్టు 8: ప్రైవేట్ వాహనాలు ప్రయాణం చేస్తే మీరు అక్కడ వదిలి వెళ్ళిన వివిధ వస్తువులు ఇస్తారో లేదో తెలియదు కానీ ఆర్టీసీ బస్సుల్లో మీరు వదిలి వెళ్లిన వివిధ వస్తువులను జాగ్రత్తగా తిరిగి ప్రయాణికుడి దరి చేర్చుకున్నారు. రాయిచూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న బస్సు లో కవిత అనే ప్రయాణీకులు ప్రయాణిస్తూ మహబూబ్ నగర్ బస్టాండ్లో రెస్ట్ రూమ్ కు వెళ్ళగా తిరిగి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది.
తన బ్యాగు బస్సులో ఉందని దాంట్లో విలువైన బంగారు ఆభరణాల తో పాటు డబ్బులు ఉన్నాయని చెప్పడంతో ఆర్టీసీ సిబ్బంది జడ్చర్ల ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. అలాగే కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్యాసింజర్ సాయి వర్షా టీ తాగడానికి కొత్తకోటలో బస్టాండ్ లో బస్సు దిగారు.
ఆ బస్సులోనే లాప్టాప్ తో పాటు సర్టిఫికెట్ లో ఉన్నాయి. వాటిని సేకరించి ప్యాసింజర్ కు జడ్చర్ల బస్టాండ్ లో లాప్టాప్ అప్పజెప్పడం జరిగినది. ఆ బస్సులో ఉన్న బ్యాగును సేకరించి సంబంధిత కవిత అనే ప్రయాణికురాలికి తిరిగి అప్పగించారు. ఏడీసీ యాదగిరి, ట్రాఫిక్ గైడ్ శివరాములు,విజయ్ కుమార్, ఆర్టీసీ లింగంపేట నరసింహులు తదితరులు ఉన్నారు.