calender_icon.png 7 July, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

03-07-2025 01:53:02 AM

రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 17న రైల్వే రోకో

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి

 గజ్వేల్, జులై 2 :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని   తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి వద్దకు బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్ష కమిటీని తీసుకుపోతామని ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని  విమర్శించారు.

  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలిస్తున్నారని, ముందుగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని కొట్టాల యాదగిరి  డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. కామారెడ్డిలో చేసిన ప్రమాణాలు సీఎం రేవంత్ రెడ్డి ఎలా మర్చిపోతారని ఆయన అన్నారు.

బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 17న ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రైలు రోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతంలో ఉన్న రైలు రోకో కార్యక్రమానికి బీసీలు వర్గాలు భారీగా తరలి రావాలి ఆయన పిలుపునిచ్చారు.