calender_icon.png 7 July, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు

03-07-2025 01:51:10 AM

దుబ్బాక  కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి 

సిద్దిపేట, జూలై 2 (విజయక్రాంతి):  అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామనీ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మండల పరిధిలోని గ్రామాల్లో, మున్సిపాలిటీ పరిధిలోని  పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లకు చేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు  త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు. లబ్ధిదారులకు విడుదలవారీగా రూ. 5లక్షలు విడుదలవుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.