25-09-2025 06:41:05 PM
మునుగోడు,(విజయక్రాంతి): ఉపాధి హామీ సిబ్బంది వేతనాల వేతనకు ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చూపిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది వేతనాలను సమస్యకు పరిష్కారం చూపాలని వినతి అందజేశారు.
గత రెండు నెలల నుంచి ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యేకు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సక్రమంగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు విన్నవించడంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.