25-09-2025 07:31:18 PM
దౌల్తాబాద్: దొమ్మాట గ్రామానికి చెందిన అక్కమొల్ల కనకయ్య గుండెపోటుతో బాధపడుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు నర్ర రాజేందర్ గురువారం కనకయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం ఉండాలన్నారు. తక్షణ సహాయంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్ర రాజేందర్ మాట్లాడుతూ... ప్రజల సమస్యల్లో, కష్టాల్లో పక్కనే నిలబడటం ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల కర్తవ్యమన్నారు. బాధితుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయనతో పాటు అంజి, రాజు, సాయికిరణ్, శ్రీకాంత్, హైమద్, యాదగిరి, ప్రభాకర్ తదితరులున్నారు.