calender_icon.png 25 September, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ శ్రీవాణి కళాశాలలో బతుకమ్మ సంబరాలు

25-09-2025 07:51:35 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ, పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలు వివిధ రూపాలలో తయారుచేసి బతుకమ్మ ఆడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ పిల్లలతో బతుకమ్మ ఆడడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ మాట్లాడుతూ... దేవతలను పూలతో పూజిస్తే పూలనే దేవతగా పూజించే పండగ మన బతుకమ్మ అని తెలపడం జరిగింది. విద్యార్థులందరికీ గౌరమ్మ ఆశీస్సులు ఉండి చక్కని విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మలను ఆకర్షణీయంగా తయారు చేసుకుని వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.