25-09-2025 07:46:53 PM
చేర్యాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రభాకర్ చేపట్టిన మాదక ద్రావ్యాల వ్యతిరేక యాత్ర గురువారం నాడు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేద్రంకు చేరుకున్నాడు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఉన్న యువతకు ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దసరా సెలవుల్లో ద్విచ క్రవాహనంపై అన్ని జిల్లాల్లో పర్యటించి యువకులను మరింత చైతన్యవంతులను చేస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.