calender_icon.png 25 September, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం: ఎంపీడీవో

25-09-2025 07:17:40 PM

నకిరేకల్,(విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉంటామని నకిరేకల్ ఎంపీడీవో జే వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని నోముల గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒక రోజు - ఒక గంట శ్రమదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం వల్ల వ్యాధులు దరిచేరమన్నారు. పంచాయతీ సిబ్బంది పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.