calender_icon.png 25 September, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలి యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

25-09-2025 07:08:59 PM

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు

బాన్సువాడ,(విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్ యార్డులలో పనిచేసే హమాలి యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభలు నిజాంబాద్ నగరంలోని శ్రద్ధానందు గంజిలో ర్యాలీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నాయకులు వస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూరు, బిచ్కుంద , పిట్లం ఎల్లారెడ్డి తదితర మార్కెట్ యార్ల నుంచి హమాలీలు స్వీపర్లు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.