25-09-2025 06:47:41 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ మట్టిబిడ్డ, ప్రముఖ రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తీవ్ర విషాదానికి గురి చేసిందని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డా. పొన్నం రవిచంద్ర అనరుమ్ వెంకట్ హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికీ, ముఖ్యంగా గౌడన్నలకు తీరని లోటు అన్నారు. ఆయన గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటుతూ, “సర్వాయి పాపన్న గౌడ్” చరిత్రను శాశ్వతంగా పుస్తకం అక్షరబద్ధం చేశారని అంతేకాక, ప్రొ. జయశంకర్ సర్ ఓడవని ముచ్చట, నోముల సత్యనారాయణ వంటి సాహిత్య ప్రముఖుల జీవితం, కృషిని కూడా గ్రంథస్తం చేశారన్నారు.
తన రచనల ద్వారా తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అపూర్వమని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తన సాహిత్య లక్ష్యమని నిరూపించారన్నారు. తెలంగాణ తత్వం, ఉద్యమ స్ఫూర్తి ప్రతి రచనలో ప్రతిధ్వనించేలా చేశారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని డా. పొన్నం రవిచంద్ర తెలియజేశారు.