calender_icon.png 25 September, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్స్ ఎక్స్ లెన్స్ అవార్డుకు చీర్ల సతీష్ ఎంపిక

25-09-2025 07:05:30 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని జెండా వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బయాలజీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చీర్ల సతీష్ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ 2025 అవార్డు కి ఎంపికై హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో అవార్డు అందుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ఎంఈఓ తెలిపారు. నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ లో ప్రదానం చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ... విద్యార్థుల్లో ఇన్నోవేటివ్ అంశాల పట్ల ఆసక్తి పెంచుతూ వినూత్న రీతిలో బోధన చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేసినందుకుగాను ఈ అవార్డు పొందడం జరిగిందని తెలిపారు. అనంతరం అవార్డు పొందిన చీర్ల సతీష్ ని  జిల్లా విద్యాధికారి, యాదయ్య,మండల విద్యాధికారి శైలజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యశోధర,సహచర ఉపాధ్యాయులు అభినందించారు.