25-09-2025 07:36:36 PM
సంఘం సభ్యుడి మరణంతో బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్ అందజేత
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని చిన్న కొడపగల్ సొసైటీ పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన సంఘ సభ్యుడు పిట్లం గంగబోయి మరణించడంతో, అతని కుటుంబానికి జేపీఏ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల చెక్కును గంగబోయి భార్య పిట్లం సాయమ్మకు పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్ గంగా గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ- సంఘ సభ్యుల భద్రత కోసం ప్రభుత్వం అందించే బీమా పథకాలు గ్రామీణ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.మరణించిన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పథకాల ద్వారా మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందాలని కోరుకున్నారు.