25-09-2025 07:25:29 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాదులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జరిగిన ఎంపికలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి నునావత్ రాహుల్(బీఏ తృతీయ సంవత్సరం) విద్యార్థి ఎంపికైనట్లు కళాశాల ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుండి కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు కళాశాల నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఉత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన నునావత్ రాహుల్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య,అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక వికాసంతో పాటుగా ఉన్నత లక్ష్యాలను, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవటానికి క్రీడలు ఎంతగానో దోహతపడతాయని, కళాశాల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించటం హర్షించదగ్గ విషయం అన్నాడు.