calender_icon.png 20 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నరకం వడ్ల బోనస్ కొరకు తాసిల్దార్ కు వినతి పత్రం

20-08-2025 01:03:43 AM

బోనస్ రాక రైతుల ఆందోళన

ధాన్యం అమ్మినప్పటికీ ఆలస్యం అవుతున్న బోనస్

పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): బోనస్ బోగస్ అయ్యింది సన్న రకం వడ్లు పండించిన రైతులకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం అన్న బోనస్ రైతుల ఖాతాల్లో జామా కాలేదు రైతులు ఎక్కువగా దొడ్డు రకం వారిని సాగు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్గా అందిస్తామని ప్రకటించడంతో ఈ యాసంగి జిల్లా లోరైతులు సున్నరకం వరినే సాగు చేశారు అయితే వ్యాసంలో సన్న రకం ధాన్యం పండించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి నేటికీ సుమారుగా మూడు నెలల అవుతుంది.

ఇప్పటికీ రైతులకు బోనస్ అందలేదు  కొనుగోలు చేసినా సన్న రకం వడ్ల బోనస్ విడుదల కాకపోవడంతో, రైతుల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకొని తహసిల్దార్ గారికి పెద్ద కొడప్ గల్ మండల భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో మెమొరడం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు బసవరాజ్ దేశాయ్ మరియు రైతులు రాజు యాదవ్ , మల్లికార్జున యాదవ్ , అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు