calender_icon.png 20 August, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్‌లో పర్యాటక కేంద్రానికి రూ.10 కోట్లు

20-08-2025 01:04:30 AM

 జిల్లా కలెక్టర్ ఆశిష్  సంఘ్వాన్

  నిజాంసాగర్, ఆగష్టు 19( విజయ క్రాంతి ), నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటక కేంద్రానికి 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం  నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ  ఏకో టూరిజం అభివృద్ధిలో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద పది కోట్ల రూపాయలతో  త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.

ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున  పర్యాటకులు  సమయమనం పాటించాలని, మంజీరా నది తీర ప్రాంతాలకు రైతులు చేపల వేటకు వెళ్లేవారు వెళ్లకూడదన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోని  20 గేట్లను గత 36 సంవత్సరాల క్రితం విడుదల చేయడం జరిగిందని. వాటికి మరమ్మతులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఈ ఈ సోలోమన్, తాసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.